ప్రత్తిపాడు శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు ప్రత్తిపాడు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో ప్రజలు అందించిన అర్జీలను స్వీకరించారు. త్రాగునీటి సమస్య, భూవివాదాలు మొదలగు అభ్యర్ధనలు స్వీకరించి వారి సమక్షంలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.