ప్రతిపాడు: బీసీల పక్షపాతి ప్రభుత్వం తెదేపా: ఎమ్మెల్యే బూర్ల

73చూసినవారు
రాష్ట్రంలో పలు కార్పొరేషన్ ద్వారా బీసీలకు రూ. 600 కోట్ల పైచిలుకు రుణాలను మంజూరు చేసి గౌడ సంఘీయులకు మద్యం దుకాణాలలో 50% రిజర్వేషన్ కల్పించడం బీసీ పక్షపాతిగా పేరుపొందిన సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ప్రత్తిపాడు నియోజకవర్గ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, బీసీ నేతలు మంగళవారం తెదేపా కార్యాలయంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్