ద్విచక్ర వాహనదారులతో ప్రత్తిపాడు ఎస్ఐ నాగేంద్ర బుధవారం ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఎస్ఐ ఆపి వారికి హెల్మెట్ యొక్క ఉపయోగాలను వివరించారు. అనంతరం ద్విచక్ర వాహనదారులతో వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో తలకు గాయమై ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు.