రేపల్లె నియోజకవర్గం లో 151. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

57చూసినవారు
శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి రేపల్లె నియోజకవర్గం లో 151. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. రేపల్లె మండలం లో 50. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా నిజాంపట్నం మండలంలో 36. 4 మిల్లీమీటర్లు, నగరం మండలంలో 33. 6 మిల్లీమీటర్లు, చెరుకుపల్లి మండలంలో 30. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. భారీ వర్షాలకు పలు చోట్ల చెట్లు నేలవాలటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది.

సంబంధిత పోస్ట్