నగరం మండలంలో గౌడ కులస్తులకు ఒక మద్యం షాపు

68చూసినవారు
నగరం మండలంలో గౌడ కులస్తులకు ఒక మద్యం షాపు
ప్రభుత్వ ఆదేశాల మేరకు గీత కార్మికులకు నగరం మండలంలో ఒక మద్యం షాపు కేటాయించినట్లు ఎక్సైజ్ సిఐ శ్రీరామ్ ప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా చెందిన గౌడ కులస్తులు ఎవరైనా మద్యం షాపుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు గడువు పొడిగించామన్నారు. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా మద్యం షాపుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్