27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేయడం పట్ల రేపల్లె బీజేపీ నాయకుడు పిన్ని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. శనివారం రేపల్లె పట్టణంలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ప్రధానమంత్రి మోడీ సారథ్యంలో డబల్ ఇంజన్ సర్కారుకు ప్రజలు పట్టడం కట్టడం పట్ల సాంబశివ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మోర్ల కృష్ణ ప్రసాద్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.