రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలైన సంఘటన చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది. రాజోలు గ్రామానికి చెందిన ముచ్చు నాగార్జున్ రెడ్డి బైక్ పై వెళుతూ ఆటోను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో నాగార్జున రెడ్డి తలకు తీవ్ర గాయం అయింది. చుట్టుపక్కల ప్రజలు గాయపడినా నాగార్జున రెడ్డిని చెరుకుపల్లి లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగటంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.