జాతీయ రహదారులు వెంట వ్యాపారాలు చేసి చిరు వ్యాపారస్తులు రోడ్లపైకి రావద్దని రేపల్లె గ్రామీణ సురేష్ బాబు అన్నారు. గురువారం రాత్రి గుళ్ళపల్లి కోటి సెంటర్ లో ఎస్సై అనిల్ కుమార్ తో కలిసి చిరు వ్యాపారస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. జాతీయ రహదారిపై తోపుడు బండ్లు ముందుకు వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. జాతీయ రహదారి వెంట వేసిన గ్రిల్స్ కి అవతల వైపే వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు.