విజయవాడలోని కేసరపల్లిలో జరిగే హైందవ శంఖారావం సభకు నగరం మండలం నుండి హిందూ సంఘాల నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఆదివారం రేపల్లె బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఇంకొల్లు మాణిక్యరావు హైందవ శంఖారావం సభకు వెళ్లే ప్రత్యేక బస్సులు జెండా ఊపి ప్రారంభించారు. హిందూ దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం ప్రభుత్వ నియంత్రణ తొలగించడం, హిందువుల ఐక్యతను బలోపేతం చేయడం ఈ సభ యొక్క ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని అన్నారు.