
GREAT: అలోవెరా నుంచి విద్యుత్ తయారు చేశారు!
AP: అలోవెరా మొక్క నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు ఒంగోలు క్విస్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు. ‘క్విస్ ఫెస్ట్-2025’లో వీరు తమ ప్రయోగాన్ని ప్రదర్శించారు. గడియారం బ్యాటరీలో ఉండే నల్లని కడ్డీని ఓ తీగకు, బ్యాటరీ చుట్టూ ఉండే కవచంను మరో తీగకు అనుసంధానించారు. ఈ తీగలను అలోవెరా గుజ్జులోకి వెళ్లేలా గుచ్చారు. దాంతో విద్యుత్ సరఫరా అయ్యి బల్బు వెలిగింది. భవ్య, జోయల్స్ అనే విద్యార్థులు ఈ నమూనాను ప్రదర్శించారు.