నిజాంపట్నం మండలం కొమరవోలులో మంగళవారం తెల్లవారుజామున 3 పూరిళ్లు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న నిజాంపట్నం జడ్పీటీసీ నర్రా సుబ్బయ్య ఘటనా స్థలాన్ని మధ్యాహ్నం సమయంలో పరిశీలించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు.