గూడవల్లి లో గౌతు లచ్చన్న జయంతి వేడుకలు

73చూసినవారు
గూడవల్లి లో గౌతు లచ్చన్న జయంతి వేడుకలు
బడుగు బలహీన వర్గాల వారికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని సీఐ కేసన రవి కిరణ్ అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న 115 వ జయంతి వేడుకలు శుక్రవారం చెరుకుపల్లి మండలంలోని గూడవల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం ఉద్యమంలో మహాత్మా గాంధీతోపాటు పోరాటం చేసిన వ్యక్తి గౌతు లచ్చన్న అన్నారు. కార్యక్రమంలో వీరంకి వెంకట శివ వీరంకి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్