కోడిపందాల స్థావరంపై అడవుల దీవి పోలీసులు దాడి చేశారు. నిజాంపట్నం మండలం వీరంకివారి పాలెం లో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి కోడిపందాలు నిర్వహిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి రెండు కోళ్లు, 4,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రవిశంకర్ రెడ్డి హెచ్చరించారు.