యుటిఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలను జయప్రదం చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు వినయ్ కుమార్ కోరారు. ఈనెల 5 నుండి 8వ తేదీ వరకు కాకినాడలో జరిగే సభలలో అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. గురువారం నిజాంపట్నం విద్యాశాఖ కార్యాలయం వద్ద స్వర్ణోత్సవ మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బాపయ్య మాట్లాడుతూ యుటిఎఫ్ ఉద్యమ నిర్మాత చెన్నుపాటి లక్ష్మయ్య ఆశయ సాధన లక్ష్యంగా యుటిఎఫ్ ఉద్యమిస్తుందన్నారు.