తీర ప్రాంత ఆక్వా సాగు రైతులు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఆక్వా బీమాను సద్వినియోగించుకోవాలని మత్స్య సహాయ సంచాలకులు బి. సైదా నాయక్ తెలిపారు. నిజాంపట్నంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గురువారం కర్లపాలెంలో ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరగనున్న ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన బీమా పథకంపై నిర్వహించనున్న అవగాహన సదస్సుకు ఆక్వా సాగు చేస్తున్న రైతులందరూ హాజరై సద్వినియోగించుకోవాలని ఆయన కోరారు.