నిజాంపట్నం: ఎస్ఎంసి చైర్మన్ లకు శిక్షణ

59చూసినవారు
నిజాంపట్నం: ఎస్ఎంసి చైర్మన్ లకు శిక్షణ
పాఠశాలల అభివృద్ధిలో ఎస్ఎంసి చైర్మన్లు భాగస్వాములు కావాలని నిజాంపట్నం ఎంఈఓ శోభాచంద్ అన్నారు. నిజాంపట్నం మండలంలోని ఆయా పాఠశాలల అభివృద్ధిలో ఎస్ఎంసి చైర్మన్లు కీలక బాధ్యతలు తీసుకోవాలన్నారు. నిజాంపట్నం ఉన్నత పాఠశాలలో మండలంలోని పాఠశాలల చైర్మన్ లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. శిక్షణ కార్యక్రమంలో పాఠశాల నిర్వహణ, పాఠశాలల పనితీరు సామాజిక తనిఖీ అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్