రేపల్లె: దొంగతనం కేసులో ముద్దాయిల అరెస్టు

79చూసినవారు
దొంగతనం కేసులో ముద్దాయిలను రేపల్లె పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా క్రైమ్ డీఎస్పీ జగదీష్ నాయక్ నిందితుల వివరాలను వెల్లడించారు. దాసరి నూతన్ బాబు మరియు మైనర్ బాలుడుతో కలిసి పట్టణంలోని జగనన్న కాలనీలో దొంగతనాలు చేశారు. వీరి వద్ద 8 లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్