కల్లుగీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు రేపల్లె రూరల్ మండలం పరిధిలో ఒకటి, మున్సిపాలిటీ పరిధిలో ఒక షాపు కేటాయించినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ దివాకర్ తెలిపారు. రేపల్లె రూరల్ మండలానికి సంబంధించి గౌడ కులస్తులు ఆరుగురు దరఖాస్తు చేసుకోగా, మున్సిపాలిటీకి సంబంధించి 11 మంది మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈనెల 10న బాపట్లలో డ్రా జరుగుతుందన్నారు.