ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌడ కార్మికులు మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలని బుధవారం రేపల్లె ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ దివాకర్ తెలిపారు. బాపట్ల జిల్లా చెందిన గౌడ కులస్తులు ఎవరైనా మద్యం షాపుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా కుల దృవీకరణ పత్రాన్ని తీసుకురావాలన్నారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా మద్యం షాపుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.