కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కోరారు. రేపల్లెలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లాల ఉమ్మడి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను గెలిపించాలన్నారు.