అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని రేపల్లె ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపల్లె ఎక్సైజ్ సిఐ దివాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్రమంగా మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో ఉప్పూడి క్రాస్ రోడ్ వద్ద దోనేపూడి కోటేశ్వరరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్దనుండి 11 క్వార్టర్ బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోటేశ్వరరావుపై కేసు నమోదు చేశామని సిఐ తెలిపారు.