రేపల్లె మండలంలోని కారుమూరు గ్రామంలో వేంచేసియున్న అమర లింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు శనివారం ఘనంగా ముగిసాయి. అతి పురాతన శివాలయంగా ఈ ఆలయం పెరుగాంచింది. శనివారం స్వామి వారి, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, దివ్య ధ్వజస్తంభ ప్రతిష్ఠ, , శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి విరాళాలు అందించిన గ్రామస్తులు, పెద్దలు దాతలకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.