రేపల్లె మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

75చూసినవారు
రేపల్లె మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
రేపల్లె రూరల్ మండలం గుడికాయ లంక మరియు రేపల్లె అర్బన్ గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు మాట్లాడుతూ రబీ సీజన్ కు సంబంధించి ప్రతి రైతు తమ వేసిన పంటను గ్రామ రైతు సేవా కేంద్రాలలో నమోదు చేయించుకోవాలన్నారు. ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. ఈ కేవైసీ చేయించుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాలు రైతులకు వర్తిస్తాయన్నారు

సంబంధిత పోస్ట్