చెరుకుపల్లిలో వాహనాల తనిఖీ

73చూసినవారు
చెరుకుపల్లిలో వాహనాల తనిఖీ
ద్విచక్ర వాహనదారులు రహదారిపై ప్రయాణించేటప్పుడు వాహనానికి సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని చెరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్ అన్నారు. బుధవారం రాత్రి చెరుకుపల్లి అంబేద్కర్ సెంటర్లో వాహనాలు తనిఖీ చేపట్టారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అన్నారు. రహదారి భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వాహనాలు నడపాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్