ఫిరంగిపురం మండల పరిధిలోని గ్రామాల్లో విద్యుత్తు మరమ్మత్తుల పనుల కారణంగా శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఫిరంగిపురం విద్యుత్ ఏఈ దుర్గాప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోతుందని విద్యుత్తు వినియోగదారులు అంతరాయానికి సహకరించాలని ఆయన కోరారు.