సైబర్ నేరాల పట్ల తుళ్లూరు మండల పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ వాసు అన్నారు. మంగళవారం రాత్రి ఆయన మాట్లాడుతూ. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లు, ఫోన్ కాల్స్ కు స్పందించొద్దని చెప్పారు. బ్యాంకు, ఇతర లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ఎట్టి పరిస్థితులు ఎవరికీ చెప్పరాదని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లకు పంపించే లింక్లను ఓపెన్ చేయరాదన్నారు.