టూరిజం సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తున్న క్రమంలో అందులో భాగంగా హ్యాండ్ లూమ్ క్లస్టర్ ను అభివృద్ధి చేయాలని, హస్తకళ లకు ప్రాచుర్యం కల్పించాలని మంత్రి కందుల దుర్గేష్ ను మంత్రి సవిత కోరారు. ఈ మేరకు తుళ్లూరు సచివాలయంలో గురువారం ఇరువురు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానికంగా ఉండే హస్తకళలకు ప్రాచుర్యం కల్పించాలని, తద్వారా నేతన్నలకు, హస్త కళాకారులకు అండగా నిలిచేందుకు ఉపకరిస్తుందని అన్నారు.