తుళ్లూరు మండలం ఉద్దండ్రాయుని పాలెం గ్రామంలో సీఆర్డీఏ భూముల్లో అనధికారకంగా పంటలు వేసి సాగుచేస్తున్న భూములను సీఆర్డీఏ అధికారులు గుర్తించారు. సీఆర్డిఏ స్పెషల్ ఎమ్మార్వో ఫణీంద్ర ఆధ్వర్యంలో భూములను జేసీబీ ద్వారా దున్నించే కార్యక్రమం సోమవారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఫణీంద్ర బాబు మాట్లాడుతూ. సీఆర్డీఏ భూముల్లో అక్రమంగా సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.