కొల్లిపర మండలం దంతులూరు గ్రామం కు చెందిన మరియమ్మ అనే మహిళ ఇంటి వెనుక 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం గుర్తు తెలియని వ్యక్తులు డంప్ చేసి వెళ్లారు. ఊరెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూసిన ఆమె దీనిపై గ్రామ రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. తన ఇంటి వెనుక రేషన్ బియ్యం ఎవరు ఉంచారో తెలియదని ఆమె చెబుతుండగా రెవెన్యూ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో బుధవారం విచారణ చేపట్టారు.