తెనాలిలో నగదు చోరీపై కేసు నమోదు

70చూసినవారు
తెనాలిలో నగదు చోరీపై కేసు నమోదు
తెనాలి మండలంలోని కటెవరం గ్రామానికి చెందిన షేక్ నసీమా, కుటుంబ సభ్యులు గురువారం ఆరుబయట నిద్రించారు. అర్ధరాత్రి దాటాక లేచి చూడగా ఇంట్లోని బీరువా తెరచి ఉండి, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగిందని గ్రహించిన నసీమా శుక్రవారం పోలీసులకు సమాచారమందించారు. ఐదు సవర్ల బంగారు ఆభరణాలు ఆపహరణకు గురయ్యాయని నసీమా పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై తెనాలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్