తెనాలి మండలం నూతన తహశీల్దారుగా గోపాలకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీలలో ఆయన తెనాలి తహశీల్దారుగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బాపట్ల, చేబ్రోలు మండలాల్లో తహశీల్దార్ గా పనిచేసి బదిలీపై తెనాలి వచ్చినట్లు తెలిపారు. మండల సమస్యలను పరిష్కరిస్తానన్నారు.