కోల్కతాలో వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ ప్రదర్శనలు చేస్తున్న విద్యార్థులు, వైద్యులపై రౌడీ మూకలు దాడులు చేయడాన్ని నిరసిస్తూ శనివారం వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ తెలిపింది. తెనాలిలోని అన్ని ప్రైవేటు వైద్యశాలల్లో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు అన్ని ఓపీ సేవలు నిలిపివేస్తున్నామని, కేవలం అత్యవసర కేసులకు మాత్రమే వైద్య సహాయం అందుతుందని తెలిపారు.