మే నెల మధ్యలో సాధారణంగా ఉండే తీవ్రమైన ఎండలతో పాటు, గుంటూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తెనాలి, ఇతర ప్రాంతాల్లో శుక్రవారం వడగళ్ల వర్షం కురిసింది. ప్రస్తుతం జిల్లాలో ఎప్పుడు ఎండ కాస్తుందో, ఎప్పుడు వర్షం పడుతుందో ఊహించలేని పరిస్థితి ఏర్పడింది.