తెనాలి: రైలులో చైన్ లాగిన ఆకతాయి

78చూసినవారు
తిరుపతి నుంచి పూరి వెళ్తున్న ఎక్స్ప్రెస్ ఆదివారం సాయంత్రం తెనాలి సమీపంలోని మల్లెపాడు వద్ద కొద్దిసేపు నిలిచిపోయింది. తిరుపతి నుంచి వస్తున్న రైలు మల్లెపాడు గేటు వద్దకు రాగానే రైలులోని ఓ వ్యక్తి చైన్ లాగడంతో రైలు ఆగింది. దీంతో ప్రయాణికులు చైన్ లాగిన వ్యక్తిని గుర్తించి టీసికి అప్పగించారు. దీంతో రైలు ముందుకు కదిలింది. మొదట అక్కడ రైలు ఎందుకు ఆగిందో అర్థం కాక ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్