తెనాలికి చెందిన బత్తుల నాగరాజు, అంకమ్మలు భార్యభర్తలు పిండి వంటలు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. తాగుడుకి బానిసైన భర్త నాగరాజు గురువారం మద్యం తాగేందుకు భార్యను డబ్బులు అడగగా లేవని చెప్పడంతో కోపంతో దాడికి పాల్పడ్డాడు. దాంతో భార్యకు గాయాలయ్యాయి. గమనిచిన స్థానికులు అంకమ్మను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.