గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులు భూ సమస్యలను పరిష్కరించుకోవాలని కొల్లిపర తహశీల్దార్ సిద్ధార్థ సూచించారు. అన్నవరంలో శనివారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని అక్కడ రికార్డులను పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి వివిధ సమస్యలపై తొమ్మిది దరఖాస్తులు వచ్చాయని వాటిని విచారణ చేసి పరిష్కరిస్తామని తహశీల్దార్ సిద్ధార్థ అన్నారు.