తెనాలి మండలం కటేవరం గ్రామంలో పేకాట స్థావరంపై రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామంలో పేకాట జరుగుతుందన్న సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు శనివారం ఆకస్మిక దాడులు చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ. 10, 200 నగదు, ఐదు బైకులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.