గన్నవరంలోని కేసరపల్లిలో రేపు జరగనున్న హైందవ శంఖారావం బహిరంగ సభకు వచ్చే ప్రజలకు తెనాలికి చెందిన శ్రీశైల భక్త సేవా సమితి బృందం అల్పాహారం అందజేయనున్నారు. శనివారం తెనాలి నుంచి లారీల సరుకులను తీసుకుని బృందం సభాస్థలికి బయలుదేరింది. ఈ వాహనాలను తెనాలి డీఎస్పీ జనార్దనరావు జండా ఊపి ప్రారంభించారు. ఆదివారం జరిగే సభలో 35 వేల మందికి అల్పాహారం అందజేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.