తెనాలి: రైలు నుంచి జారిపడి వాచ్ మెన్ మృతి

58చూసినవారు
తెనాలి: రైలు నుంచి జారిపడి వాచ్ మెన్ మృతి
రైలు నుంచి జారి పడి గాయాలపాలైన ప్రయాణికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చీరాలకు చెందిన భాస్కర్ (48) నిడుబ్రోలులోని రైతుబజార్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం రైలులో ప్రయాణిస్తూ తెనాలి స్టేషన్లో రైలు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పోలీసులు వైద్య శాలకు పంపగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. తెనాలి జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్