చికిత్స పొందుతూ నూతన వరుడు మృతి

59చూసినవారు
చికిత్స పొందుతూ నూతన వరుడు మృతి
తెనాలి మండలంలోని సోమసుందర పాలెం గ్రామానికి చెందిన గుర్రం రాము (27)కు ఐదు నెలల క్రితం వివాహమైంది. ఇటీవల కాలంలో కుటుంబంలో కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబసభ్యులు గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. వైద్యుల సమాచారం మేరకు తెనాలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్