ప్రజా సమస్యల పరిష్కారం డా.చదలవాడ అరవింద బాబుతోనే సాధ్యం..!

74చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారం డా.చదలవాడ అరవింద బాబుతోనే సాధ్యం..!
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించగల ఏకైక నాయకుడు మాత్రమేనని డా.ఆదిత్య పేర్కొన్నారు. ఈ మేరకు సత్తెనపల్లి రోడ్డులోని కోడెల క్రీడా ప్రాంగణంలో మార్నింగ్ వాక్ విత్ చదలవాడ కార్యక్రమం నిర్వహించారు. కోడెల శివప్రసాద్ రావు క్రీడా ప్రాంగణం పేరును మార్చి స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంగా మార్చడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా,మంత్రిగా,సభాపతిగా అనేక దశల్లో ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి పేరును తొలగించడం కోడెలను అవమానించడం కాదా అన్నారు. సభలు పెట్టడం సర్దుకునిపోవడం తప్ప ఏ రోజైనా అభివృద్ధి గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.ట్రాక్ ఉన్న వైపు లైటింగ్ లేదు,మరుగుదొడ్ల నిర్వహణ గాలికొదిలేశారన్నారు. కోట్లలో నిధులు కేటాయిస్తున్నా, సదుపాయాలు ఎందుకు కల్పించడం లేదో ప్రజలు ఆలోచించాలన్నారు.గత ఐదేళ్ల పాలనలో స్టేడియంలో చిన్న అభివృద్ధి కూడా చేయలేదని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్