సాగు హక్కు ధృవీకరణ పత్రంపై రెవెన్యూ, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అమర్తలూరు మండల వ్యవసాయ శాఖ అధికారిణి ఉయ్యూరు లోకేశ్వరి అన్నారు. శుక్రవారం అమర్తలూరు మండలంలోని ముల్పూరు, పెదపూడి గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పంటసాగు హక్కు ధృవీకరణ పత్రం పొందడం వల్ల ఉపయోగాలు, ఎలా దరఖాస్తు చేయాలి వంటి విషయాలను, కౌలు రైతులకు దీనివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.