ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు ఆర్థిక భరోసా ఇస్తుందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. మండలం పాంచాలవరం గ్రామానికి చెందిన కొమరబత్తిని ప్రమీల రాణి అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. సర్జరీకి అవసరమైన 2, 14, 934 రూపాయలను ఆదివారం విప్పర్ల సౌభాగ్యం కుటుంబ సభ్యులకు ఎల్ఓసి రూపంలో చెక్కును అందజేశారు.