వేమూరు మండలంలోని జంపని గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మసీదు నిర్మాణానికి శుక్రవారం ముస్లిం మత పెద్దలతో కలిసి వైసీపీ ఇన్చార్జ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరకు అశోక్ బాబు శంకుస్థాపన చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాలను గౌరవించే ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు, గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ మైనార్టీలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారని అశోక్ బాబు తెలిపారు.