చిన్నారుల మనోవికాసంపై అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని కొల్లూరు సెక్టార్ సూపర్ వైజర్ తాటి విజయలక్ష్మి తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్యా దినోత్సవంను పురస్కరించుకొని కొల్లూరు 1, 14 అంగన్వాడీ కేంద్రాలలో బుధవారం వస్తువుల ప్రదర్శన వేడుకలను అంగన్వాడీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు ఆట పాటలతో కూడిన విద్యను అందిస్తున్నారన్నారు.