రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు త్రిప్టు పండు కంట్రిబ్యూషన్ కు బడ్జెట్లో కేటాయించిన 5 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి మురుగుడు సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు దీపాల సత్యనారాయణలు డిమాండ్ చేశారు. శనివారం భట్టిప్రోలులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ బడ్జెట్ ఆమోదించిన 5 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు.