భట్టిప్రోలు మండలం వెల్లటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి దున్న సురేష్ బాబు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలలో ప్రథమ స్థానం సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ కుమారి తెలిపారు. బాపట్లలో జరిగిన సైన్స్ ఫెయిర్ పోటీలలో ప్రథమ స్థానం సాధించిన సురేష్ బాబును జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం అభినందించి బహుమతి ప్రధానం చేశారు. శనివారం సురేష్ బాబును పాఠశాల సిబ్బంది అభినందించారు.