శరవేగంగా సాగుతున్న వెల్లటూరు ఛానల్ పనులు

70చూసినవారు
శరవేగంగా సాగుతున్న వెల్లటూరు ఛానల్ పనులు
వెల్లటూరు ఛానల్ భట్టిప్రోలు మెయిన్ డ్రైన్ ఛప్తా కూలిపోవడంతో నూతన ఛప్తా నిర్మాణ పనులు చేపట్టారు. గత నెల 23వ తేదీన వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. 36 వేల ఎకరాలకు సాగునీరు అందించే వెల్లటూరు ఛానల్ ఛప్తా పడిపోవడంతో గత రబీ సీజన్లో రైతులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 11 కోట్లతో నిర్మిస్తున్న ఛప్టా పనులు వేగవంతమయ్యాయి.

సంబంధిత పోస్ట్