కూటమి పార్టీల అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికలలో బరిలో నిలుచున్న అలపాటి రాజా గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చెప్పారు. మంగళవారం కొల్లూరు గ్రామంలోని రీ క్రియేషన్ క్లబ్లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి కూటమి అభ్యర్థి విజయానికి సహకారం అందించాలన్నారు.