ఈనెల 27న జరిగే కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కోరారు. గురువారం వేమూరులో కూటమి నాయకుల విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈనెల ఏడో తేదీన జరిగే ఆలపాటి రాజా నామినేషన్ కు భారీగా తరలి రావాలని కోరారు.